మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 16) నుండి జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయం కారణంగా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ భారత్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో.. మహ్మద్ షమీ గురించి కీలక ప్రకటన చేశాడు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు.
రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది పెద్ద షాకింగ్ వార్త. జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ.…
కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో.. ఆ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా.. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
ఐపీఎల్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక జట్టు తర్వాత ఒక జట్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే సీఎస్కే బౌలర్ మహీష్ పతిరణ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానుండగా.. తాజాగా రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఐపీఎల్ కు దూరం కానున్నాడు.…
ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే.. మ్యాచ్ కు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంకానున్నట్లు సమాచారం. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో పతిరణకు గాయమైంది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంక క్రికెట్…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 19, Pmla act కింద ఈడీ అరెస్ట్ చేశారు. కవిత నివాసం నుంచి మూడు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. దుర్గంచెరువు మీదుగా శంషాబాద్ కి ఈడీ తీసుకెళ్తున్నారు. అంతకుముందు కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తలకు, అభిమానులకు నినాదాలు చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని…