రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.