ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాలని రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట పటేల్ నగర్ నుండి ముసారంబాగ్ బ్రిడ్జ్ వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. breaking news,…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా, వరదలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో 42 కాలనీల్లోని ఇళ్లలోకి వర్షం వరద నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అధికారులు పాలకులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు వంకలు పొంగిపోర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. breaking news,…
గద్వాల జిల్లాలో నకిలీ వీఆర్ఏల గుట్టు రట్టైంది. గత కొన్ని ఏళ్ళుగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్న నలుగురు వీఆర్ఏలు పట్టుబడ్డారు. దీంతో.. తహసీల్దార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినెట్స్ గా నియమించడంతో నకిలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ వీఆర్ఏలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్టీఐ యాక్టివిస్ట్ విన్నవించారు. breaking news, fake VRA, telugu news,…
వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తూ.. వీఆర్‌ఏలను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులగా క్రమబద్దీకరించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. breaking news, latest news, telugu news, Former VRA, big news, cm kcr