ప్రమాదం జరిగినప్పుడు స్పందించే విధానంతోనే ఆ ప్రమాద ప్రభావం ఉంటుంది. మన చుట్టప్రక్కల ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంటే ఓ సారి ఊహించుకోండి.. ఇలాంటప్పుడు చాలా వరకు తమను తాము కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నాలే చేస్తారు. అయితే.. ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా.. లేక ప్రమాద తీవ్రతను తగ్గించడానికైనా ముందుకు వచ్చి ప్రయత్నాలు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన.. ఓ పెట్రోల్ బంక్‌లో డిజీల్ కొట్టించుకునేందుకు వచ్చిన లారీ డిజీల్…
రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. ఏకంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టిస్తున్నాడో కేటుగాడు… ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గా పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ కాల్స్ చేయడం మొదలెట్టాడు. ప్రభుత్వం కొత్తగా లోన్ స్కీం తెస్తోందని.. 100 మంది సభ్యులకు లోన్లు అందించబోతోందని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ఒక్కో వ్యక్తి కి 3600 చొప్పున 3 లక్షల 60 వేలు తాను చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిన మోసగాడు..…
కొంపల్లి ప్రాంతంలో నివాస గృహాలు నిర్మిస్తామని మాయమాటలతో ‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, కంపెనీ ఎండీ ముల్పూరి శివరామ కృష్ణ, కంపెనీ సీఈవో తొడ్డాకుల నరసింహారావు కూడా ఉన్నారని శనివారం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 406, 420,…
మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్ (26) గత నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్ వద్దకు వెళ్లి బీర్ కావాలని షాప్ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న…
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (65) పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే) విజయవాడ, హైదరాబాదు లను కలిపే 181 కిలోమీటర్ల నాలుగు నుంచి ఆరు వరుసల జాతీయ రహదారి. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసలనుండి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు.…
యూపీలో వైద్యుడి నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్ వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు. తాజాగా యూపీలో ఇలాంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో…
దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.…
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ -31.51, భువనగిరి -27.97, చేవెళ్ల -20.35, హైదరాబాద్-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 16.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. భద్రాద్రి…
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. తనకు స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని క్లాస్ రూమ్ లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘనపూర్ లోని హ్యాపీ ఆరఫాన్ హోమ్ లో ఘటన చోటు చేసుకుంది.. కాసర్ల సతీష్ కుమార్తె స్వప్న (20) తన చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల అతని తండ్రి అయిన సతీష్ 2009వ సంవత్సరంలో ఆర్ఫాన్ హోమ్ లో చేర్పించాడు..…
ఎన్నికల ఉద్యోగికి పాముకాటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమో న్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగి విపుల్ రెడ్డిని పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. అక్కడి 15వ పోలింగ్ కేంద్రంలో టాయిలెట్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన్ను 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా విపుల్ రెడ్డి జైనథ్…