తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు…
ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతాలపై .. స్పష్టంగా మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని మూల సిద్ధాంతమని, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యచరణ పేరే బీజేపీ అని ఆయన అన్నారు. బీజేపీ ని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్లు రద్దు చేయించాలి అనేదే అజెండా అని, దేశ స్థాయిలో చర్చ కు రావడం తో.. బీజేపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. దాంట్లో భాగంగానే.. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేసి అక్రమ…
వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల…
ఉప్పల్ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది…
ఒక వ్యక్తి కారు బైక్ లో పెట్టకుండా తన చొక్కాలు 20 లక్షల నగదు 27 తులాల బంగారం తీసుకుని వెళ్ళవచ్చా ఏమో కానీ ఈ యువకుడు తన చొక్కాలో దాచిపెట్టుకొని అంత పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకు వెళుతు వుండగా పోలీసులు పట్టుకున్నారు.పుష్ప సినిమా తరహాలో డబ్బులని చొక్కల్లో దాచుకున్న యువకుడు పట్టుబడిన వైనం ఇది. ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక…
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు అని, రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గా రెడ్డి. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ ని తిడితేనే హరీష్ ని…
వేసవిలో, ప్రజలు శరీరాన్ని చల్లబరచడానికి మరియు వేడి స్ట్రోక్ నుండి తప్పించుకోవడానికి వివిధ రకాల పదార్థాలను తీసుకుంటారు. అందులో సోమఫు ఒకటి. వేసవిలో సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి, ఫెన్నెల్ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంది. అందువలన ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మరియు కడుపులో వేడిని తగ్గిస్తుంది. విటమిన్లు, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి అనేక పోషకాలు ఫెన్నెల్‌లో ఉన్నాయి, ఇవి అనేక వ్యాధులను…
కాంగ్రెస్ సంపదను, మహిళల పుస్తెలు.. ముస్లిం లకు పంచుతామనీ అంటున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హెచ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని మర్చిపోయారని, ముస్లిం ఓట్లు బీజేపీ పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో బీజేపీ ఏం చేశావో చెప్పు అని, ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్…
రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను.. రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్…
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడమని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక కరెంట్ సమస్యలు పరిష్కరించామన్న హరీష్…