Fire Break : పెట్రోల్ బంక్ లోనే పేలిన లారీ డిజీల్ ట్యాంక్.. అతడే లేకుంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదం జరిగినప్పుడు స్పందించే విధానంతోనే ఆ ప్రమాద ప్రభావం ఉంటుంది. మన చుట్టప్రక్కల ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంటే ఓ సారి ఊహించుకోండి.. ఇలాంటప్పుడు చాలా వరకు తమను తాము కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నాలే చేస్తారు. అయితే.. ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా.. లేక ప్రమాద తీవ్రతను తగ్గించడానికైనా ముందుకు వచ్చి ప్రయత్నాలు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన.. ఓ పెట్రోల్ బంక్‌లో డిజీల్ కొట్టించుకునేందుకు వచ్చిన లారీ డిజీల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడున్న వారంతా పరుగో పరుగో పెట్టారు. కానీ.. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. పేలిన డిజీల్ ట్యాంక్ నుండి చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ముందుక వచ్చాడు. బంక్‌లో ఉన్న ఫైర్ సెఫ్టీ పరికారాలను ఉపయోగించి ట్యాంకర్‌లో చేలరేగిన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే.. ఒక్కడే ఇదంతా చేస్తున్నా.. అక్కడ ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడేందుకే ప్రయత్నించారు తప్ప… తనకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కొంత సేపటికి పెట్రోల్ బంక్‌లో పనిచేసే మరో వ్యక్తి తనతో కలిసి మంటలను పూర్తి ఆర్పివేశారు. దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటన యాదాద్రిలోని నాయర పెట్రోల్ బంక్‌లో చోటు చేసుకుంది. ఉదయం 10.21 గంటల ప్రాంతంలో పెట్రోల్ బంక్‌లోకి వచ్చిన లారీ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. “అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే మంటలను ఆర్పే యంత్రాన్ని తీసి మంటలను ఆర్పారు. డయల్ 100 లేదా ఫైర్ డిస్ట్రెస్ కాల్స్ చేయలేదు” అని భువనగిరి పోలీసులు తెలిపారు. భువనగిరి నుంచి నల్గొండ రహదారిలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటలు చల్లార్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఈ మధ్య తరచూ ఏదో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతుండగం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. వేసవి కాలం నేపథ్యంలో మంటలు వేగంగా అంటుకుంటున్నాయి. అగ్నిమాపక అధికారులు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
డీజిల్ పోసుకోవడానికి వచ్చిన లారీ డీజిల్ ట్యాంక్ పగిలి చెలరేగిన మంటలు.#YadadriBhuvanagiri #Lorry #DieselTanker #NTVNews #NTVTelugu pic.twitter.com/8a5URBUZII
— NTV Telugu (@NtvTeluguLive) May 19, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?