1. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ ముగిసన తర్వాత భేట కానున్న కేబినెట్. బడ్జెట్‌కు ఆమోదం తెలపనన్న తెలంగణ కేబినెట్. రేపు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్.
2. నేడు ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ. ఇవాళ ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ కానున్న సీఎం జగన్. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం.
3. ఢిల్లీలో నేడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యాచరణపై చర్చ.
4. విశాఖ : నేడు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు. రైల్వే స్టేడియంలో పోటీలు ప్రారంభించనున్న మంత్రి రోజా. 26 జిల్లాల నుంచి పాల్గొననున్న 3వేల మంది క్రీడాకారులు.
5. నేడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చ. భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కేంద్రం.
6. నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ. చాగల్లు గ్రామం కొత్తపేట ( ఎస్సీ పేట ) లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రౌండ్స్ లో జరుగనున్న రచ్చబండ. ఉదయం 9 గంటలకు నల్లజర్ల నుండి బయలుదేరి చాగల్లు రానున్న వై ఎస్ షర్మిల. రాత్రి నల్లజర్ల వద్ద ప్రియాంక కన్వెన్షన్ లో బస చేసిన షర్మిల… రచ్చబండ అనంతరం తుని బయలుదేరి వెళ్లనున్న షర్మిల.
7. ఆదిలాబాద్‌లో నేడు నాగోబా మహా పూజ. నియమ నిష్ఠలతో నాగోబా ను పూజించనున్న మెస్రం వంశీయులు. ఉదయం కొత్త కుండల్లో కోనేరు నీరు తీసుకు రానున్న మెస్రం వంశ మహిళ లు. రాత్రి మహా పూజ. జాతరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మహా పూజ తో ప్రారంభం కానున్న జాతర. వివిధ రాష్ట్రాల నుంచి తరలి రానున్న మెస్రం వంశీయులు. పాద యాత్ర గా వెళ్లి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం తో నాగోబా సన్నిది ని శుద్ది చేసి సాంప్రదాయ పూజలు చేయనున్న మెస్రం వంశీయులు.
8. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో నేడు అవిశ్వాస పరీక్ష. BRS పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సెన్ జయమ్మ పై అవిశ్వాసం పెట్టిన సొంత పార్టీ కౌన్సిలర్లు.
9. మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతరామ చంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ అమావాస్య జాతర.. జాతర మహోత్సవం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు, చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు..
10. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమువాడ మున్సిపల్ కౌన్సిలర్ల కి విప్ జారీ చేసిన brs జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య.. తన వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ (బీఅర్ఎస్).. ఖాళీ గా ఉన్న వైస్ ఛైర్మెన్ పదవి కోసం ఈ నెల 12 తేదీన ఎన్నిక.. వైస్ చైర్మన్ గా మారం కుమార్ కు అనుకూలంగా ఓటు వేసి వైస్ చైర్మెన్ గా ఎన్నుకోవాలని పార్టీ ఆదేశాల జారీ.. బీఅర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపు తరలిన నేపథ్యంలో లో వారి నివాసాలకు నోటీసులు అంటించిన పార్టీ విప్ ఆదేశాలు..