మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా మన అలవాట్లు కూడా సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా తిన్న తర్వాత కొన్ని అలవాట్లు చేయడం చాలా మంచిది. నిజానికి కొంతమందికి రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. మీరు కూడా ఇలా చేస్తే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ తప్పుడు అలవాటు వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. అలాగే బరువు పెరుగుతారు. రాత్రి భోజనం చేసిన…
బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి.. ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి…
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ బదిలీలు జరుగుతున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోని పలు కీలక శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే శనివారం 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం…
డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నగరంలోని కమిషన్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం తెలిపింది. ఉదయం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉన్న చెక్‌లిస్ట్ మరియు ధృవీకరణ ఫారమ్‌ను డౌన్‌లోడ్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఇరికేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కేసీఆర్ సభకు రావాలని, ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు…
నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్‌గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు. చేయదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయీ, భవిష్యత్ లోనూ పని చేస్తాయి. కలిసి పని చేయమని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని, గతంలో పీసీసీ…
`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి…
పదేండ్లు అధికారంలో ఉండి.. ఆంధ్రా నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. చేపల పులుసు తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తనని శపథం చేసిన కేసిఆర్.. ఇప్పుడు అధికారం పోగానే గజినిలా గతం మరిచిపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. 2015 లో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇప్పుడు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను…
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ…