WhatsApp: మరో కొత్త ఫీచర్‌తో అదరగొట్టబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో మొబైల్ తెలియని వారు లేరు. అందులో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండనే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో దుమ్మురేపుతున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్‌డేట్‌లో, వినియోగదారులు వారి వాట్సాప్ ప్రొఫైల్‌ల కోసం కవర్ ఫోటోలను సెట్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు వారి ప్రొఫైల్ ఫోటోలను మాత్రమే పెట్టుకోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌లో పెట్టుకునే కవర్ ఫోటో మాదిరిగా వాట్సాప్‌లో అలాంటి ఫీచర్ లేదు. ఇలాంటి ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.
అయితే ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ కేటలాగ్‌ను నిర్వహించడానికి కొత్త ఫీచర్ పనిచేస్తోంది. వ్యాపార కార్యకలాపాల కోసం కవర్ ఫోటోను సెట్ చేసే సామర్థ్యం, భవిష్యత్ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. బిజినెస్ సెట్టింగ్‌ల క్రింద వినియోగదారులు అదనపు కెమెరా బటన్‌ను ఆప్షన్‌ను పొందుతారు. కొత్త కెమెరా బటన్‌ను ఉపయోగించి, వినియోగదారులు తమ ప్రొఫైల్‌లకు కవర్ ఫోటోలను సెట్ చేసుకోవచ్చు అని వెల్లడించింది.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!