ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అద్భుత సమయం రానే వచ్చేసింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి అంతరిక్ష చిత్రం విడుదల అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్ ఈ ఫోటోను వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. కనులవిందుగా ఉండే ఈ చిత్రంలో నక్షత్రాలు, భారీ గేలక్సీలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ సందర్భంగా.. మానవాళి ఇప్పటివరకూ చూడని సుదూరమైన ఇన్‌ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెల్లడించారు.…