Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్‌కి రైతులు ‘‘అనుకూల వాతావరణాన్ని’’ సృష్టించారని, అయితే దానిని విజయంగా మార్చడంలో ఆ పార్టీ విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. ‘‘హుడా కాంగ్రెస్ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం..అతను ఎవరితో కాంప్రమైస్ కాలేకపోయాడు. పార్టీ అన్ని బాధ్యతలు అతడి పైనే ఉంచింది’’ అని అన్నారు.
హర్యానాలోని ప్రముఖ వాద్రా ల్యాండ్ డీల్ కేసులో కొన్నేళ్ల విచారణ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలకు క్లీన్ చిట్ లభించింది. భూ బదలాయింపులో ఎలాంటి ఉల్లంఘన జరిగినట్లు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించలేదు.