హర్యానాలోని ప్రముఖ వాద్రా ల్యాండ్ డీల్ కేసులో కొన్నేళ్ల విచారణ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలకు క్లీన్ చిట్ లభించింది. భూ బదలాయింపులో ఎలాంటి ఉల్లంఘన జరిగినట్లు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించలేదు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అవకతవకలను తెలుసుకోవడానికి ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది.
Also Read: Tornadoes Storms: ఓక్లహోమాలో గాలివాన బీభత్సం… తుఫానులకు ఇద్దరు మరణం
రాష్ట్రంలోని మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కొనసాగుతున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 28 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నడుస్తున్నాయని హర్యానా పోలీసు ఐజీ క్రైమ్ రాజశ్రీ హైకోర్టుకు తెలిపారు. వీటిలో 20 కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, ఎనిమిది కేసుల్లో ఆరు విజిలెన్స్ వద్ద, రెండు ఇతర సిట్‌ల వద్ద ఉన్నాయి. వాద్రా భూముల వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించలేదు. ఆర్థిక అవకతవకలపై సిట్ విచారణ జరుపుతోంది. సిట్ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దర్యాప్తు కోసం, ప్రభుత్వం 22 మార్చి 2023న SITని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్, ఏఎస్ఐ ఉన్నారు.