ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ కేసును కోర్టు కొట్టేసిందని భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు. కేవలంలో కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
Congress: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే,
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్ షీట్‌లో ప్రస్తావించబడింది.
Chhattisgarh Election 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరిగింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ చివరి దశలో మొత్తం 253 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.
Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు.
Mahadev Betting APP owner allegations on Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించడంతోనే బెట్టింగ్ యాప్ రూపొందించానని, తాను ముఖ్యమంత్రి సహాయకులకు ఇప్పటివరకు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్ తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో చెప్పాడు. ఇందుకు…
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 508 కోట్లు పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దుర్గ్ జిల్లాలోని తన సాంప్రదాయ స్థానమైన పటాన్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Chhattisgarh Assembly Election: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో షా మత హింసను ప్రేరేపించారని పార్టీ ఆరోపించింది.