Congress: ఏడాదిలోగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే, 2024లో మాత్రం మెజారిటీ మార్కుకి దాదాపుగా 30 సీట్ల దూరంలో 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 సీట్లను సాధించింది. దీంతో మళ్లీ మోడీ అధికారం చేపట్టడానికి మార్గం సుగమం అయింది. తెలుగుదేశం, జేడీయూ, శివసేన వంటి ఎన్డీయే పార్టీలు ప్రధాని మోడీకి సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది మధ్య పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు నరేంద్ర మోడీని తమ నాయకుడిగా మరియు తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్న రోజున బఘేల్ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Barathiyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..
ఓ బహిరంగ సమావేశంలో బఘేల్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని రాజస్థాన్ కౌంటర్ భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లపై కూడా విరుచుకుపడ్డారు.యోగి కుర్చీ వణుకుతోందని, భజన్ లాల్ ఊగిసలాడుతున్నారని, ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పారు.
బీజేపీకి స్వతహాగా మెజారిటీ రాకపోవడం, ఇతర ఎన్డీయే మిత్ర పక్షాలపై ఆధారపడి ఉండటంతో, ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..