తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తాను కార్యకర్తల మనిషిని, కార్యకర్తల కోసమే నిలబడతానని అన్నారు. తాను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఇంఛార్జికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు.
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు..
తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తిరుమలలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
Bhumana Karunakar Reddy: తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు.. ఘటనపై సిబిఐ విచారణ కాని., సిట్టింగ్ జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ముందా..? వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని నాశనం చేశారంటూ అబద్దాలు చెప్పి ఓట్లు వెయించుకున్నాడు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వేసినా విజిలెన్స్ విచారణ…