తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి మాత్రమే ఆవిర్భావ దినోత్సం జరుపుకుంటామని తెలిపారు. 24-02-1130లో నగరానికి జగద్గురు రామానుజాచార్యులు శంఖుస్థాపన చేశారన్నారు. తిరుపతి అంచెలంచెలుగా ఎదుగుతూ మహానగరంగా మారిందని పేర్కొన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో స్పీడు పెంచాయి. ఈ క్రమంలో.. తిరుపతిలో యాదవ సంఘాలతో వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించింది. యాదవ, కురుబ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరం ఎన్నడూ లేని విధంగా మహా నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
Bhumana Karunakar Reddy React on Tirumala Annaprasadam Complaints: తిరుమల అన్నప్రసాద సముదాయంలో ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు రాలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ‘మాకు ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు అందలేదు. నిన్న కొంతమంది భక్తులు అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆందోళన చెయ్యడం మా దృష్టికి వచ్చింది. నిజంగా నాణ్యత లేదంటే వాటిని సరిదిద్దుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ఇతర భక్తులను కూడా వారు రెచ్చగోట్టేలా వ్యవహరించడం సముచితం కాదు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ…
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించారు. ఆచార్య రుత్విక్ నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.