హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కేటీఆర్ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం ఈ వేడుకకు హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ సినిమా…
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే. ఇక అప్పటి నుచ్న్హి పవన్ గురించి ప్రతి ఫంక్షన్ లో బండ్ల మాట్లాడే మాటలు అటు చిత్ర పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. గబ్బర్ సింగ్, తీన్ మార్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ జోష్ అంతా తెలంగాణాలోనే కనిపిస్తోంది. ఆంధ్రలో స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు… టిక్కెట్ రేట్లు అధికంగా అమ్మితే ఊరుకునేది లేదని కూడా థియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న ‘దిల్’ రాజు ప్రభుత్వం నుండి రోజుకు ఐదు ఆటలు చొప్పున రెండు వారాల పాటు ‘భీమ్లా నాయక్’ను ప్రదర్శించడానికి అనుమతి తెచ్చుకున్నారు. అలానే పెద్ద…
లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. నేడు హైదరాబాద్ మొత్తం వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నా భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక నేడు ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. చాలా రోజుల నుంచి టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంటే, ఈరోజు జరగనున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున సన్నాహాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఫిబ్రవరి 23కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. పవన్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలిరానున్నారు. అయితే ఇంతకుముందు ఇదే వేదికగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’…