టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే. ఇక అప్పటి నుచ్న్హి పవన్ గురించి ప్రతి ఫంక్షన్ లో బండ్ల మాట్లాడే మాటలు అటు చిత్ర పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. గబ్బర్ సింగ్, తీన్ మార్, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్లన్న స్పీచ్.. గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. ఆ స్పీచ్ విన్న ప్రతి పవన్ అభిమాని ఫిదా కాకుండా ఉన్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ కి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ లేకుండా ఉండదు. అయితే ఈసారి బండ్లన్న మెరుపులు ఉంటాయా..? అనే కొంతమంది ఉంటాయని.. మరికొందరు ఉండవని అంటున్నారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ కి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అదికాకుండా ఇటీవల త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి లీక్ అయ్యి సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇంత జరిగాక బండ్లన్న స్టేజి మీదకు వచ్చే దైర్యం చేస్తాడా..? అనేది తెలియాలి. అయితే బండ్ల గణేష్ రావాలని మాత్రం పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ భక్తుడిగా ఆయన మాటల్లో మా భావాలను పంచుకుంటున్నాం.. అలాంటిది ఆయన స్పీచ్ లేకపోతే మా దైవం పవన్ కళ్యాణ్ గురించి మా తరుపున మాట్లాడేవారు ఎవ్వరు ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వేడుకలో బండ్లన్న ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? తెలియాలంటే కొద్దిసేపు ఎదురుచూడాల్సిందే.