పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. చాలా రోజుల నుంచి టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంటే, ఈరోజు జరగనున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు విదేశాల్లో ‘భీమ్లా నాయక్’ ప్రీ సేల్స్ కూడా భారీ సంఖ్యలో జరుగుతున్నాయి.
Read Also : Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ
ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్‌డ్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “భీమ్లా నాయక్” యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ 10 గంటల క్రితం $400k మార్కును దాటింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే ఈ మూవీ $500kకి చేరుకుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాల ప్రీ-సేల్స్, ఓవరాల్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించిన “భీమ్లా నాయక్” చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.