డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వచ్చే వెహికిల్స్ ను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సుమారు 1700 వాహనాలను సీజ్ చేశారని ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్విరామంగా 1360 కిలోమీటర్లు కొనసాగింది.. breaking news, latest news, telugu news, bhatti vikramarka, peoples march padayatra,
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం నాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది.. breaking news, latest news, telugu news, bhatti vikramarka, brs, congress,
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. 105వ రోజు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే నుంచి ప్రారంభమైంది. హుసేనాబాద్, మామిళ్ళగూడెం వరకు ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. మామిళ్ళగూడెం వద్ద భట్టి విక్రమార్క లంచ్ బ్రేక్ తీసుకోనున్నాడు. సాయంత్రానికి ఖమ్మం జిల్లాలోకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించనుంది.