అందరినీ కలుపుకొని పోయేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం లో సమన్వయ కమిటీ వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయి కమిటీ లు వేస్తున్నామన్నారు. దేశంలో గత పది ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న బిజెపి దేశాన్ని దోపిడీ చేసిందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని , అస్తులని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వవల్సిన అవసరం వుందన్నారు. జనాభా దామాషా పద్ధతి లో వనరుల పంపిణీ కావాల్సి వుందని, కాపిటలిస్ట్ లకు బిజెపి దోచి పెడుతోందన్నారు. వనరులను కేసీఆర్ దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విచ్ఛిన్నం చేసిందన్నారు. కరెంట్ పోకపోయిన కరెంట్ పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ దిగజారి ప్రచారం చేస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. గ్గులేకుండా రాష్ట్రం లో తిరుగుతున్నారని, రాజకీయ చైతన్యం తెలంగాణ లో వుందన్నారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా సహకరించాలన్నారు. మంత్రులం ముగ్గురం కలసి కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేస్తామని, 4వ తేదిన కొత్తగూడెం లో సిఎం రేవంత్ రెడ్డి సభ వుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మత తత్వపార్టీ అయిన బీజేపీ, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్‌ను ఒడించాలన్నారు. సిగ్గులేకుండా కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారని, చేతిలో కర్ర పట్టుకుని యాక్షన్ చేస్తూ రైతులు, ఆడబిడ్డల మీద ప్రమ ఒలక పోస్తున్నారని, బీఆర్‌ఎస్‌కు జీరో సీట్లు వస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏమి ఓరగా పెట్టారు కేసీఆర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు ముగ్గురు కూడా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారని, వచ్చే అయిదేళ్ళు ఖమ్మం జిల్లా లో సమయం కేటాయించి జిల్లా అభివృద్ధి లో కీలకంగా పని చేస్తానన్నారు. సీపీఐ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. దేశం లో కాంగ్రెస్ కూటమి అధికారం లోకి రానున్నదని, నరేంద్ర మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.