Bhatti Vikramarka : ఇందిరమ్మ పాలనలో వెలుగుల ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణా స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటు నిర్మాణాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత పాలకుల వైఫల్యాల వల్ల నిలిచిపోయిన పనుల గురించి తెలుసుకొని యుద్దప్రాతిపదికన ఆపనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నేరుగా పవర్ ప్లాంట్ ను సందర్శించి అధికారులతో సమీక్షించారు. గత మూడు నెలల కాలంలో పలలుమార్లు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి పనుల్లో వేగం పెంచిన ఫలితంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న పర్యావరణలు అనుమతులు మంజూరయ్యాయి. భట్టి విక్రమార్క చొరవతో సాధించిన అనుమతుల వల్ల ఇందిరమ్మ పాలనలో వెలుగుల ప్రస్థానం మొదలైంది.
50% విదేశీ బొగ్గు, 50% స్వదేశీ బొగ్గుతో దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని 2017 జూన్ 15న నాటి ప్రభుత్వం కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులు సాధించింది. ఒప్పందానికి భిన్నంగా నూరు శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసింది. మార్చిన టెక్నాలజీతో పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాయి. టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు పొందాలని 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించి, అనుమతులు నిలిపేసింది. 2023 డిసెంబర్ 6 వరకు అధికారంలో ఉన్న గత పాలకులు పర్యావరణ అనుమతులు సాధించేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పట్టు పట్టి మారిన టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు సాధించేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజానీకాన్ని సమన్వయం చేసుకోని ఈ సంవత్సరం ఫిబ్రవరి 20న మరో సారి ప్రజాభిప్రాయసేకరణ విజయవంతంగా పూర్తి చేయించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించిన షరతులు అన్నిటిని పూర్తిచేసి రెండు నెలల కాలంలోనే అనుమతులు సాధించారు. ఫలితంగా 2025 ఫిబ్రవరి నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ అనుమతులు రావాడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈసందర్భంగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
తాజావార్తలు
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!