Bhatti Vikramarka: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరుకుంది. ఇవాళ భట్టి పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. నేడు కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది. జామ్నే గ్రామం నుంచి 8 కిలోమీటర్ల తరువాత ఘాట్ రోడ్డు పక్కన లంచ్ బ్రేక్ ఉంటుంది. కెరిమెరి లో రాత్రి కి కార్నర్ మీటింగ్ కెరిమెరి గ్రామంలోనే రాత్రికి బస చేయనున్నారు భట్టి. ఆరవ రోజు సుమారు 15 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర సాగనుంది.
Read also: Pakisthan : నన్ను కోర్టులో చంపేయొచ్చు.. చీఫ్ జస్టిస్ కు ఇమ్రాన్ లేఖ
నిన్న ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజు కొనసాగింది. భట్టి పాదయాత్ర ముదిగొండ మండలం నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర పమ్మికి చేరుకుంది. ఈనేపథ్యంలో.. భట్టికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భట్టి విక్రమార్కతో పలు సమస్యలపై గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. భట్టి పాదయాత్రలో ప్రభుత్వ లోపాలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు రుణాలు.. చదువుకున్న ప్రతీ ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టి విక్రమార్క మార్చి 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. అయితే.. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే..
Pakisthan : నన్ను కోర్టులో చంపేయొచ్చు.. చీఫ్ జస్టిస్ కు ఇమ్రాన్ లేఖ