New Criminal Laws: నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఇందులో నిందితుడిపై పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా ఫిర్యాదు చేశారు.
కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్-1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో అమలులోకి రానున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన బిల్లులు వలస రాజ్యాల కాలం నాటి చట్టాలను ముగింపు పలుకుతాయని ప్రధాని అన్నారు.