G20 Summit: జీ20 సదస్సు తొలిరోజు తొలి సెషన్ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపం గురించి ప్రధాని మొదట మాట్లాడారు. అక్కడ సుమారు 300 మంది మరణించారు.
న్యూ ఢిల్లీ అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి యూఎన్ రికార్డులలో ఇండియా పేరును భారత్‌గా మారుస్తుందని గ్లోబల్ బాడీ ప్రతినిధి ఈరోజు వెల్లడించారు.
జీ- 20కి సంబంధించిన విందుకు ఆహ్వానంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'భారత రాష్ట్రపతి' అని సంబోధించడంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. భారత్, ఇండియా అంటే ప్రేమ అని అన్నారు.
INDIA: ఇండియా పేరును భారత్ గా కేంద్ర మారుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనకు బలం చేకూరుస్తూ జీ20 సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలను విందుకు ఆహ్వానించే నోట్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ప్రచురించడం,
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో రాజ్యాంగ ప్రవేశిక వ్రాయబడింది. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.
రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి 'ఇండియా' అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు.