తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తేదీ చాలా ప్రత్యేకమైనది.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 2009 డిసెంబర్ 9న తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లభించింది.. ఉవ్వెత్తున్న ఎగసిన ఉద్యమం ఓవైపు, ఆత్మబలిదానాలు మరోవైపు, ఉద్యమనేత కేసీఆర్ అకుంఠిత దీక్ష.. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణపై ప్రకటన చేసింది.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్…
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు.
త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో బరిలోకి దిగుతుందా? లేక టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పోటీ చేస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. నిన్నటి నిన్ననే టీఆర్ఎస్ను…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న…