Madhu Yashki: హయత్ నగర్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో పోలీసుల సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల, రంగారెడ్డి జిల్లా వినాయకనగర్‌లోని హయత్‌నగర్‌లోని ఎల్‌బి నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. మధుయాష్కీ తన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మధుయాష్కీ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మధుయాష్కీ తెలిపారు.
విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని మధుయాస్కీ ఆరోపించారు. అయితే డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. తన నివాసంలో భారీగా నగదు ఉందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సభ్యులు మధుయాస్కీ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Atrocious: మెదక్ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన చిన్న గాయం
Also Read
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్‌ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!