భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది.
జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్ అతి పెద్ద సమస్య అని.. ఆ హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi spreading divisive agenda, says BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తోంది. రాహల్ గాంధీ విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు.
ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతారని వెల్లడించారు.
Rahul Gandhi's comments on RSS and Varun Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోషియార్ పూర్ లో భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆఫీసుకు వెళ్లాలంటే ముందుగా నా తల నరకాలి అంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ, తన బంధువు వరణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పెరుగుతున్న ఊహాగానాల మధ్య రాహుల్ గాంధీ ఈ…
భారత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ఓ వ్యక్తి రాహుల్ గాంధీ భద్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.
Off The Record: దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెద్ద కార్యక్రమం భారత్ జోడో పాదయాత్ర. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంటోంది. ఏదో సాదాసీదాగా భారత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని ముగించకుండా.. భారీగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని 21 రాజకీయపార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం టీడీపీకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్లింది. బీఆర్ఎస్ను…