Rahul Gandhi: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్ అతి పెద్ద సమస్య అని.. ఆ హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయనకు జమ్మూకశ్మీర్‌లోని కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. యాత్రలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అనేక మంది ప్రజలను కలుసుకున్న రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్‌లో దేశంలోనే అత్యధిక స్థాయిలో నిరుద్యోగం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు పూర్తి మద్దతు ఇస్తుందని సత్వారి చౌక్‌లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ అన్నారు. తన యాత్రలో ఎంతో మంది ప్రజలతో మాట్లాడానని.. వారు తమ సమస్యలను లేవనెత్తారని ఆయన చెప్పారు. పాలనా యంత్రాంగం తమ గొంతు వినడం లేదని వారు తనతో చెప్పారని ఆయన అన్నారు. మొత్తం వ్యాపారాన్ని బయటి వ్యక్తులు నడుపుతున్నారని.. జమ్మూకశ్మీర్ ప్రజలు నిస్సహాయంగా కూర్చొని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Akhilesh Yadav: 2024 ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొట్టడం ఖాయం..
జమ్మూకశ్మీర్‌లో దేశంలోనే అత్యధిక నిరుద్యోగం ఉందని.. యువకులు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని ఆకాంక్షిస్తున్నారని, కానీ వారు చేయలేరని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఇంతకు ముందు ఉపాధి కల్పించేందుకు ఆర్మీ ఉందని.. ఇప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన అగ్నివీర్ అనే కొత్త పథకం ద్వారా అది కూడా మూసివేయబడిందని ఆయన విమర్శించారు. ఆగస్ట్ 2019 లో ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని ప్రతిపాదించింది.