Rahul Gandhi Bharat Jodo Yatra Stops In Jammu and Kashmir Due To Security Lapse: భద్రతా సిబ్బంది ఇచ్చిన ఝలక్ మేరకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను జమ్ముకశ్మీర్‌లో తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. యాత్ర మార్గంలో భారీ జన సమూహాల్ని నియంత్రించడంలో భద్రతా సిబ్బంది విఫలమైంది. స్థానిక పోలీసులు సైతం మాయం అవ్వడంతో.. యాత్రను అర్థాంతరంగా ఆపేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక యంత్రాంగం వైఫల్యం వల్లే యాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది ఇచ్చిన సూచనల మేరకు.. మేరకు పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Google: హెచ్‌ఆర్‌కి ట్విస్ట్ ఇచ్చిన గూగుల్.. ఇంటర్వ్యూ చేస్తుండగానే..
దీంతో కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారమైన ఖాజీగుండ్ సమీపంలో జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘రాహుల్ గాంధీ బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీగుండ్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని వెస్సు వైపు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. కానీ, బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు ఒక్కసారిగా మాయం అయ్యారు. భారీ జనసమూహాలను నియంత్రించడంలోనూ లోపాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితిలో పాదయాత్ర చేయడం కుదరదని రాహుల్ సెక్యూరిటీ సూచించింది. దీంతో పాదయాత్రను ఆపేసి.. రాహుల్ గాంధీ ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక వద్దకు వెళ్లారు’’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు
కాగా.. శుక్రవారం నాడు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. భద్రతా లోపం కారణంగా కిలోమీటర్‌లోపే నిలిపేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా.. భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ జమ్మూ-కశ్మీర్ ఇన్‌ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం స్పందిస్తూ.. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు