Bharat Jodo Yatra: రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆరోరోజు కొనసాగుతోంది. ఇవాల్టితో రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్రకు 54వ రోజు. ఇవాళ షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సర్దార్ పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించారు. గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాద ఘటన బాధితులకు 2 నిముషాలు మౌనం పాటించారు. ఇవాళ లింగారెడ్డి గూడ, చాంద్రాయణ గూడ, కొత్తూరు మీదుగా పెద్దషాపూర్, ముచ్చింతల వరకు యాత్ర కొనసాగనుంది. కొత్తూరులో లంచ్ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం పెద్దషాపూర్ లో సభ నిర్వహించనున్నారు. ఇవాళ రాహుల్ దాదాపు 28 కి.మీ. మేర నడవనున్నారు. కాగా, రాత్రికి శంషాబాద్ తండుపల్లి వద్ద రాహుల్ బస చేయనున్నారు.
Read also: Karthika Somavaram Stothraparayanam Live: తొలి కార్తీకసోమవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
రాహుల్ గాంధీ పాదయాత్ర 54 రోజుల క్రితం కన్యాకుమారి నుంచి ప్రారంభమై ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల ప్రైవేటీకరణకు చెక్ పెడతామని, రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కున్న దళిత, గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?