సోమవారం శివుడికి ఎంతో ఇష్టమయిన వారం. ఈరోజు స్తోత్ర పారాయణం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. ఆదివారం నాడు సూర్య భగవానుడి స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్యభగవానుడే. ఆయన అశ్వారూఢుడై లోకమంతా సంచరిస్తూ తన కిరణాలతో జాతిని మేల్కొలుపుతూ వుంటాడు. ఆయన స్పర్శ తగిలితే ఎలాంటి మొండి వ్యాధులైనా నయం అవుతాయి.
గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి బాధ అయినా మీ నుంచి దూరమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి వున్నా ఈ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో శుభకరం.
మాఘ అమావాస్య నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ దోషాలు పటాపంచలైపోతాయి.ప్రతి నెల ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే మార్చినెలలో రెండవ తేదీన వచ్చే మాఘ అమవాస్య కు ఎంతో విశిష్టత వుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు.. పవిత్ర నదులలో స్నానం చేయడం…
మాఘమాసం అన్ని శుభకార్యాలకు శుభుసూచకం. లలితా దేవి ఈ మాసంలోనే జన్మించింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ నెలలోనే. ఈ మాసానికి అది దేవత కేతువు. మాఅఘము అంటే పుణ్యం ఇచ్చేదని అర్థం. ఈ నెలలో చేసే పారాయణం ఎంతో శుభదాయకం. నువ్వులు దానం చేసిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేయడం ఈ నెలలో ఎంతో మంచిది.
యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. మాఘమాసంలో అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు.…
శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.