ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. ఆదివారం నాడు సూర్య భగవానుడి స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్యభగవానుడే. ఆయన అశ్వారూఢుడై లోకమంతా సంచరిస్తూ తన కిరణాలతో జాతిని మేల్కొలుపుతూ వుంటాడు. ఆయన స్పర్శ తగిలితే ఎలాంటి మొండి వ్యాధులైనా నయం అవుతాయి.