శ్రీ రామానుజ సహస్రాబ్దిలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. హైదరాబాద్ చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రపతిని శాలువాతో సన్మానించారు సీఎం కేసీఆర్.
మాసశివరాత్రి ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సూర్యుని వల్ల ఆరోగ్యం, శివుని వల్ల సంపదలు కలుగుతాయి. ఆదివారం రవివారం. అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటివాడైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ”జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం” అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం, సంపద మనకు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం నాడు ఆదిత్యుడికి…
పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా! గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది.
పవిత్రమయిన మాఘమాసం సందర్భంగా శ్యామల నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి. శ్రీ దేవీనవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రతీక్ష నవరాత్రి అని పిలుస్తారు. మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు. అఘము…