పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం తన అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా విజయ పరంపరను…
కాసేపట్లో చార్మినార్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా.. మీటింగ్ అనంతరం చార్మినార్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని .. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సందర్భంగా.. టెంపుల్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. CAA అమలు తరువాత తొలిసారి ఓల్డ్ సిటీకి వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య కేసు తరహాలోనే చెన్నైలో ఓ యువకుడిని మాజీ ప్రియురాలి హత్య చేయడం సంచలనంగా మారింది. దారుణంగా హత్య చేయడమే కాకుండా 400 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టింది.