తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య కేసు తరహాలోనే చెన్నైలో ఓ యువకుడిని మాజీ ప్రియురాలి హత్య చేయడం సంచలనంగా మారింది. దారుణంగా హత్య చేయడమే కాకుండా 400 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టింది. చెన్నై పోలీసులు ఆ మహిళను భాగ్యలక్ష్మిగా గుర్తించారు. ఆమె మాజీ ప్రియుడి హత్య కేసులో నిందితులకు సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు ఎం.జయంతన్‌గా గుర్తించారు. 29 ఏళ్ల జయంతన్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్‌వేస్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 18న స్వగ్రామం విల్లుపురం వెళ్లిన జయంతన్ తిరిగి రాకపోవడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని సోదరి ఫిర్యాదు చేసింది. దీంతో జయంతన్ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసును పోలీసులు చేధించారు.
Also Read: Congress: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు
కేసు దర్యాప్తులో భాగంగా జయంతన్ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ మిస్టరీగా పరిగణించారు. జయంతన్ హంతకుడు మరెవరో కాదని, అది అతని మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మి అని నిర్ధారించి, ఆమెను అరెస్టు చేశారు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మార్చి 20న జయంతన్ కాళ్లు, చేతుల్ని నరికి ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో తీసుకెళ్ళి చెన్నై సమీపంలోని కోవలం దగ్గర నిర్మాణుష్య ప్రదేశంలో ఖననం చేసినట్లు పోలీసులు గుర్తించారు. జయంతన్ మొండెం, ఇతర శరీర భాగాల్ని భాగ్యలక్ష్మి బ్యాగులో పెట్టుకొని మార్చి 26న చెన్నై సమీపంలోని కోవలం దగ్గర పాతిపెట్టినట్లుగా విచారణలో వెల్లడయింది.
Also Read: Home Theatre Explodes: హోం థియేటర్ పేలుడు.. పెళ్లి కొడుకుతో పాటు మరొకరి మృతి..