మీమ్స్.. సీరియస్ విషయాన్ని కూడా ఎవ్వరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడమే. అలాంటి మీమ్స్ చేసే టాలెంట్ ఉంటే మీలో ఉందా.. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొన్ లక్షలు సంపాదించవచ్చు.
Wife Swap: బెంగుళూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జయనగర్లో గత వారం మణికంఠ(43) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిది సహజ మరణం కాదని, హత్య అని సిద్ధాపుర పోలీసుల విచారణలో తేలింది.
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
Gay Partner : ఫిబ్రవరి 28న మైసూరు రోడ్డులోని నాయండహళ్లిలోని పాత భవనంలో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. తన స్వలింగ సంపర్క భాగస్వామే అతడిని కొట్టి చంపాడు.
iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
Bengaluru: బెంగళూర్ లో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి మరణించినా, నిద్ర పోతుందని భావించిన పిల్లాడి అమాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అసలు అమ్మ ఎందుకు లేవడం లేదో తెలియదు, మాట్లాడదు, కదలదు, తనకు అన్నం పెట్టదు.. అయినా అమాయకంగా తన తల్లి నిద్ర పోతుందని భావించాడు ఆ పిల్లాడు. తల్లి మరణించినా రెండు రోజలు పాటు మృతదేహం పక్కనే నిద్రించాడు.
Leela Pavithra murder case: మంగళవారం బెంగళూరులో లీలా పవిత్రను కిరాతకంగా కత్తితో పొడిచి ఉన్మాది దినకర్ హత్య చేయడం కలకలం రేపింది.. అయితే.. ఇవాళ బెంగళూరులోనే లీలా పవిత్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జగన్నాథపురంలో నివాసం ఉంటున్నారు లీలా పవిత్ర తల్లిదండ్రులు.. ఇప్పటికే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులుగా అప్పగించారు బెంగళూరు పోలీసులు.. తల్లిదండ్రులకు లీలా పవిత్ర (28) ఏకైక కుమార్తె కావడంతో.. వారిని అదుపుచేయడం ఎవరి తరం కావడంలేదు.. కాగా,…
సమాజంలో మహిళలను బతకనివ్వడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడవలేకపోతోంది. ప్రేమిస్తే పెద్దవాళ్ళు చంపేస్తున్నారు.. పెళ్లి చేసుకొంటే భర్త చంపేస్తున్నాడు.. ప్రేమించమని ప్రేమోన్మాదులు చంపేస్తున్నారు. ఇలా ఎక్కడా ఒక మహిళకు రక్షణ లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ఆ అమ్మాయి కల.
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని…