RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయంతో నగరమంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ, చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం మిగిల్చింది. పెద్ధ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 37 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది.
Read Also: Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
అయితే, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో.. వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకొని ఆర్సీబీ జట్టును చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులు అందరూ ఒక్కసారిగా రావడంతో స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రవేశ టికెట్లు ఉన్నవారికే పోలీసులు అనుమతి ఇచ్చినా.. అదుపు తప్పిన జనసందోహం ఈ ప్రమాదానికి కారణమైంది.
Read Also: Rajendra Prasad: జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ అలా పిలవను!
ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న బోరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు, యువకులు ఉన్నారు. అయితే, స్టేడియంలో తొక్కిసలాట జరిగిన తర్వాత నెలకొన్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
7 dead. Many are battling for life after a stampede due to the irresponsibility of Congress govt.
No crowd control measures. No basic arrangements. Just chaos.
While innocent people died, @siddaramaiah & @DKShivakumar were busy shooting reels & hogging limelight with… pic.twitter.com/IVPuQjXxcq
— BJP Karnataka (@BJP4Karnataka) June 4, 2025