Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మి(29) హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్‌ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బెంగళూరులో మంగళవారం జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల జంట హత్యలు జరిగిన ఒక రోజు తర్వాత, ప్రధాన నిందితులు సహా ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.