Bengaluru: ‘‘అథితి దేవోభవ’’ అని చెబుతుంటారు పెద్దలు. కానీ కర్ణాటకలో మాత్రం కొందరు విపరీతమైన భాషా దురాభిమానంతో వ్యవహరిస్తున్నారు. కన్నడేతరుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బెంగళూర్ లేదా ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే వారిని బలవంతంగా ‘‘కన్నడ’’ మాట్లాడాలని వేధిస్తున్నారు. ఈ జాడ్యం ఇతర రాష్ట్రాల వారిపై దాడి చేసేదాకా వెళ్లింది. ఇక ఉబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులకు అర్థంకాని…
బెంగళూరులో పట్టపగలు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అందరు చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. మహిళ అన్న విషయం మరిచి భౌతిక దాడికి తెగబడ్డారు ఓ షాపు యజమాని, సిబ్బంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని అవెన్యూ రోడ్‌లోని మియా సిల్క్ శారీస్ అనే దుకాణానికి హంపమ్మ అనే మహిళ వెళ్లి చీరలను దొంగిలించింది. అయితే ఈ తతంగం అంతా షాప్ లోని సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ…
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని కమిషన్ నిర్ధారించింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదికలో వెల్లడించింది. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది.
RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్‌పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు.…
Bengaluru: బెంగళూర్ నగరంలో ఇటీవల ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి.
Darshan Case: కన్నడ స్టార్ నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో దాదాపుగా 4 నెలల పాటు జైలులో ఉన్న దర్శన్‌కి ఇటీవల ఆరోగ్య కారణాలతో కర్నాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజైరు చేసింది.
బెంగళూరులో గత 12 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన రంజాన్ షేక్ (38) అలియాస్ మహమ్మద్ రంజాన్ షేక్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని నారైల్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ షేక్ 2012 నుంచి బెంగళూరులోని చిక్క బనహళ్లిలో నివాసం ఉంటూ చెత్త వ్యాపారం చేస్తున్నాడు. అతడి వద్ద నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉన్నాయి.
Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందిని నేడు పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపారు. ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. మే 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు వారందరినీ బెంగళూరు పోలీసులు విడివిడిగా విచారించనున్నారు. ‘సన్ సెట్ టు సన్…