బెంగళూరులో గత 12 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన రంజాన్ షేక్ (38) అలియాస్ మహమ్మద్ రంజాన్ షేక్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని నారైల్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ షేక్ 2012 నుంచి బెంగళూరులోని చిక్క బనహళ్లిలో నివాసం ఉంటూ చెత్త వ్యాపారం చేస్తున్నాడు. అతడి వద్ద నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉన్నాయి.
READ MORE: Crime: ట్రాంక్విలైజింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి.. మహిళ పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం..
భారత్ నుంచి అతను జనన ధృవీకరణ పత్రాన్ని కూడా పొందాడని, అందులో అతని జన్మస్థలం పశ్చిమ బెంగాల్ అని చూపబడిందని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని కేఆర్ పురం ఆర్టీఓ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. షేక్ మొదటి వివాహం బంగ్లాదేశ్‌లో జరిగింది. అయితే అతను బెంగళూరులో రెండవ వివాహం చేసుకున్నాడు. తన రెండవ భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అతను భారతీయ పాస్‌పోర్ట్‌తో బంగ్లాదేశ్‌కు వెళ్లేవాడు. జనవరి 2023లో షేక్ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి రసూల్ హవల్దార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
READ MORE:Delivery Agent : బతుకు పోరాటం.. రెండు చేతులు లేకున్నా.. బండి నడుపుతున్న జొమాటో డెలివరీ బాయ్
షేక్ మొదటి భార్య నూర్జహాన్ బేగం బంగ్లాదేశ్‌లో ఉంటోంది. అతడి అరెస్ట్ అనంతరం బెంగుళూరులో షేక్ ఉన్నాడని ఆమె గుర్తించింది. ఫిబ్రవరి 2023లో ఆమె మెడికల్ వీసాపై భారతదేశానికి వచ్చి వైట్‌ఫీల్డ్ డివిజన్ పోలీసులను కలిసింది. షేక్ బంగ్లాదేశ్‌లో జన్మించాడని, పౌరుడిగా నిరూపించే పత్రాలను సమర్పించింది. ఫిబ్రవరి 2023- సెప్టెంబర్ 2023 మధ్య, షేక్ భారతీయ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి రెండుసార్లు బంగ్లాదేశ్‌కు ప్రయాణించారని పోలీసులు గుర్తించారు. తాజాగా కూడా మళ్లి బంగ్లాదేశ్‌కి వెళ్లాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డి)కి బెంగళూరుకు తిరిగి వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో అతడిని మళ్లీ అరెస్టు చేసి మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.