పిల్లలు, యువతకు కంటే 60 ఏళ్ల పైబడి వృద్ధులకు యోగా చాలా అవసరం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తమ జీవనశైలిలో యోగాను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి.
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. "యోగం" అనే పదం సంస్కృత మూలం "యుజ్" నుండి వచ్చింది, దీని అర్థం "చేరడం," "కలయిక", లేదా "ఏకం చేయడం".