International Yoga Day 2024: వృద్ధులు రోజూ తప్పకుండా చేయాల్సిన ఆసనాలు ఇవే..
- పిల్లలు.. యువతకంటే వృద్ధులకే ఆసనాలు అవసరం
- ఆ వయసులో వచ్చే రకరకాల సమస్యల నివారణకి ఆసనాలు దోహదం
- 60 ఏళ్లు పైబడిన వృద్ధులు సులబంగా చేస్తూ.. ఆరోగ్య ప్రయోజనాలు పొందే మూడు ఆసనాలు గురించి తెలుసుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు, యువతకు కంటే 60 ఏళ్ల పైబడి వృద్ధులకు యోగా చాలా అవసరం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తమ జీవనశైలిలో యోగాను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, 60 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా చేయగలిగే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
READ MORE: ESI Hospital: దిక్కున్న చోట చెప్పుకోండి.. ఈఎస్ఐలో రోగులపై సిబ్బంది జులుం
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
1. బాలాసన..
ముందుగా ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి. ఈ భంగిమను కనీసం 30 సెకన్ల పాటు వేసినా చాలు మీరు ఈ భంగిమలో 1 నుంచి 3 నిమిషాలు ఉండవచ్చు. ఇది రోజుకు కనీసం 5 సార్లు చేయాలి. ఈ ఆసనం శరీరానికి విశ్రాంతినిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది.
READ MORE: India vs Pakistan: భారత్- పాకిస్తాన్ ప్రత్యక్ష చర్చలకు సపోర్ట్ ఇస్తాం..
2. తాడాసనం..
అన్నింటిలో మొదటిది.. తాడాసనం. ఇది ఎలా చేయాలో చూడండి. నేలపై నేరుగా నిలబడండి. మీ రెండు పాదాలను ఒకచోట చేర్చి, మీ రెండు అరచేతులను మీ పక్కన పెట్టుకోండి. మొత్తం శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీర బరువును రెండు కాళ్లపై సమానంగా ఉంచండి. ఆ తర్వాత రెండు అరచేతుల వేళ్లను కలిపి తలపైకి తీసుకోవాలి. అరచేతులను నిటారుగా ఉంచండి. చేతులను పైకి లాగండి. ఇది మీ భుజాలు, ఛాతిని కూడా సాగదీస్తుంది. దీనితో పాటు, పాదాల మడమలను కూడా పైకి లేపండి. కాసేపు ఆగిన తర్వాత శ్వాస వదులుతూ మామూలు స్థితికి చేరుకోండి. ఈ ఆసనం శరీరానికి సమతుల్యత మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. తడసానం చాలా సులభం. 60 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా చేయవచ్చు.
READ MORE: Pawan Kalyan : వారంలో రెండు రోజులే.. పవన్ కల్యాణ్ షాకింగ్ డెసిషన్..?
3. శవాసన..
నేలపై తివాచీ లేదా yoga mat పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ… ఒకటి, లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. ఏవైపునకు వుంచితే హాయిగా ఉంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి ఉంచాలి. కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. ఈ ఆసనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తడి దూరమవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!