ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ చెన్నై, ఐపీఎల్ ను ట్యాగ్ చేశాడు. సీఎస్కే స్టోక్స ఎంట్రీకి సంబంధించిన వీడియోను ఇవాళ తన ట్విట్టర్ లో రీలిజ్ చేసింది.
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.…
Ben Stokes: ఇటీవల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటోంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ముందే బెన్ స్టోక్స్ పాకిస్థాన్ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే తన…
T20 World Cup Final 2022: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ నిలిచింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. సునాయాసమైన 138 పరుగుల టార్గెట్ ను ఆడుతూపాడుతూ అందుకుంది. 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 138 పరుగులును ఛేదించింది. ప్రపంచకప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మరో ఓవర్ ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన…
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి…
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…
నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును అద్భుత రీతిలో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని కేవలం 50 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఛేదించింది. దీన్ని బట్టి ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెయిర్‌స్టో టీ20 మ్యాచ్ తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కొండంత లక్ష్యం కర్పూరంలా కరిగిపోయింది. 93 పరుగులకే నాలుగు వికెట్లు పడినా…