Ben Stokes Joins Jacques Kallis and Sir Garfield Sobers Elite List: యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ఆటలో మొత్తం 11 వికెట్లు పడడంతో.. మ్యాచ్ మలుపులు తిరుగుతూ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్…
అదే విధంగా ఇంగ్లీష్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను దారుణంగా ట్రోలింగ్ చేసింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే ట్యాగ్ తో ఓ కథనాన్ని ప్రచురించింది.
England Captain Ben Stokes react on BuzBall Cricket vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2023 ( Ashes 2023)లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. ‘బజ్‌బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్‌కు ఆసీస్ భారీ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. తొలి మ్యాచ్…
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా ఒక్కసారిగా బయటకు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన బెన్ స్టోక్స్.. ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి మరీ ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
Steven Smith tensed after Ben Stokes set a fielding in Ashes 2023: యాషెస్ సిరీస్ 2023లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో రోజు ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 279 బంతుల్లో 14×4, 2×6) సెంచరీతో ఆసీస్ కోలుకుంది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 311/5తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు అండగా మాజీ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట.
చెన్నై సూపర్ కింగ్స మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ ( శుక్రవారం ) సైన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అడతాడని సమాచారం.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో బెన్ స్టోక్స్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతను తర్వాత మ్యాచ్ లకు దూరమయ్యాడు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్ కు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రానున్న టోర్నీపై ఉత్కంఠత రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.