సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు.…