Israel-Hezbollah War: హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి కొనసాగుతుంది. ఈ తరుణంలో బీరుట్‌లోని దాహియాతో పాటు పొరుగుప్రాంత ప్రజలు తమ ఇళ్లను వదిలి పెట్టి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.
Hassan Nasrallah: హెజ్‌బొల్లానే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్‌లోని హెచ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేయగా.. ఇందులో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ చనిపోయినట్లు సమాచారం.
Israel-Hezbollah: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది.
ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు.
బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..