బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని తెలిపారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు.
తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
రీల్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మహిళ మృతి 23 ఏళ్ల మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మృతురాలు ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వసేగా గుర్తించారు. శ్వేత సులి భంజన్ ప్రాంతంలోని దత్ధామ్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆమె రీల్ చేయడానికి ప్రయత్నించింది.…
బీఆర్ఎస్ నాయకులు చేసిన పాపాలని కడుక్కుంటూ.. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు గతములోనే తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లు మళ్ళీ చేస్తా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. నువ్వు పొర్లు దండాలు పెట్టిన మీ మామ నిన్న పార్టీ అధ్యక్షుడు నీ చేయరని, సలహాలు,సూచనలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ నీ బీజేపీ లో మెర్జ్ చేయడం…
కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్‌గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం…
కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని, సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీ లో చెప్పారని, కేసీఆర్…