కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్‌పై పూర్తి విశ్వాసం…
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 కోసం రంగం సిద్ధమైంది. డబ్ల్యూపీఎల్ 2026 కోసం ప్లేయర్ల వేలం లిస్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. వేలం కోసం మొత్తం 277 మంది ప్లేయర్స్ జాబితాను బీసీసీఐ రిలీజ్ చేసింది. 277 మంది ప్లేయర్స్.. ఐదు ఫ్రాంచైజీలలో అందుబాటులో ఉన్న 73 స్థానాల కోసం పోటీ పడనున్నారు. వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. గత సంవత్సరం 120 మంది ఆటగాళ్లు వేలంలో పోటీ…
దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ గిల్.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే బ్యాటింగ్ కూడా చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్‌లో గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఆరోగ్యంపై…
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24…
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణికి ఘన స్వాగతం పలికేందుకు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. విమానాశ్రయ సిబ్బంది ఎంఎస్కేను లోపలికి అనుమతి లేదంటూ అడ్దకున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకుంది. ఈ విషయంపై ఎస్పీకి ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ జోక్యంతో ఎయిర్‌పోర్ట్‌లోనికి ఆయనకు అనుమతి దక్కింది. Also Read: Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన…
Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న…
World Cup 2025 BCCI: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించినా.. ఇప్పటి వరకు విక్టరీ పరేడ్ (అభినందన కార్యక్రమం) ఏదీ..? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి ఎందుకు ఆ విపక్ష. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి టీమిండియా మొదటిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన విజయానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. బీసీసీఐ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ చేయలేదు.…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల…
Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు.
2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. Also…