ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 వేలం తేదీలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వేలం 2025 డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐతో చర్చించి.. ఈ తేదీలను సూచించారట. అయితే వేలం తేదీల విషయంకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌దే తుది నిర్ణయం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. Also Read: IND vs…
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సతీమణి ఆర్తి అహ్లావత్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో ఆర్తి డేటింగ్ (సహజీవనం) చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. డేటింగ్ విషయం తెలిసే సెహ్వాగ్ తన సతీమణి ఆర్తికి కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడట. ఆర్తికి…
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. అయితే పీసీబీ చీఫ్…
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జూలై 2024లో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గౌతీ కోచ్‌గా వచ్చాక టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025ను కైవసం చేసుకుంది. వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలిచే గంభీర్.. జట్టును మాత్రం అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆసియా కప్ విజయం నేపథ్యంలో గౌతీ…
ఆసియాకప్ 2025 ఫైనల్స్ లో భారత్ -పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. టైటిల్ పోరులో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించింది. భారత్ విజయంలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం మరువలేనిది. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు. Also Read:Pawan Kalyan :…
ఆసియా కప్ 2025 ఫైనల్ (IND vs PAK ఫైనల్)లో టీం ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక మైదానంలో హైడ్రామా చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. దీంతో ట్రోఫీ పతకాలను స్వీకరించడానికి నిరాకరించిన తర్వాత, ACC అధ్యక్షుడు, PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తనతో పాటు ట్రోఫీ, పతకాలను తీసుకెళ్లారని బీసీసీఐ…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి…
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.